Ayodhya - Chiru Ram Charan | రామ మందిరం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా : రామ్‌ చరణ్‌

Ayodhya - Chiru Ram Charan | రామ మందిరం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా : రామ్‌ చరణ్‌ Chiru, Ram Charan | అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు యావత్‌ భారతీయులతో పాటు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయ‌కులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. తెలుగు ప్రజల అందరి సాక్షిగా ఆ అయోధ్య రాముడి ముందు శిరసు వంచి నమస్కరిస్తున్నాను నా అభిమాన దేవుళ్లందరిని చల్లగా చూడాలని ఆ అయోధ్య రాముణ్ణి వేడుకున్నానని చెప్పారు ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రాణ ప్రతిష్ట కోసం అయోధ్య చేరుకున్నారు. భార్య సురేఖ, కుమారుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ram Charan)తో కలిసి హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో అయోధ్య వెళ్లారు. అయోధ్య చేరుకున్న అనంత‌రం రామ్‌చరణ్‌ (Ram Charan) మీడియాతో మాట్లాడారు. రామ మందిరం కోసం ఎన్నో ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్నా. ఈ మహత్తర కార్యంలో భాగం కావడం సంతోషంగా ఉంద‌ని రామ్ చ‌ర‌ణ్ తెలిపాడు. దీనిపై చిరంజీవి మాట్లాడుతూ.. చరిత్రలో గుర్తుండిపోయే రోజు ఇది. ఇందులో భాగం కావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా. నేను ఆంజనేయుడి భక్తుడిని. ఆయనే స్వయంగా వచ్చి నన్ను దీవిస్తూ నాకు ఆహ్వానం పంపించినట్లు అనిపించింది, అని చిరు తెలిపాడు. అప్పుడు చిరుమాటలు వింటుంటే తాను ఎంత పులకరించిపోయాదనేది తన మాటల్లో తెలుస్తుంది తానెంత ఆంజనేయ భక్తుడనేది తన మాటల్లోనే కాదు తనని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది మరోవైపు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్ సహా, సౌత్‌ సూపర్‌ స్టార్స్‌ రజినీకాంత్‌, ధనుష్‌, బీటౌన్‌ తారలు విక్కీ కౌశల్‌ – కత్రినా కైఫ్‌, రణబీర్‌ కపూర్‌ – అలియా భట్‌, కంగనా రనౌత్‌, మాధురీ దీక్షిత్‌, క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తదితరులు కూడా ఇప్పటికే అయోధ్య చేరుకున్నారు. వీళ్ళతో పాటు చాలా మంది సినీ ప్రముఖులు ఆహ్వానం మేరకు అయోధ్యకు బయలుదేరడం జరిగింది కానీ కొంతమందికి ఆహ్వానం వస్తుందని ఎడిరిచూసిన వాళ్లకు అసహనం రాకపోవడం వాళ్లలో నిరాశను చూడడం జరిగింది

CURRENT UPDATES

Journalist KNR

1/24/20241 min read

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. కోట్లాది మంది ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది. మరికొన్ని గంటల్లోనే అయోధ్య (Ayodhya )లో రామ మందిరం (Ram Mandir) ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు యావత్‌ భారతీయులతో పాటు దేశం నలుమూలల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయ‌కులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.

తెలుగు ప్రజల అందరి సాక్షిగా ఆ అయోధ్య రాముడి ముందు శిరసు వంచి నమస్కరిస్తున్నాను నా అభిమాన దేవుళ్లందరిని చల్లగా చూడాలని ఆ అయోధ్య రాముణ్ణి వేడుకున్నానని చెప్పారు.

ఇక టాలీవుడ్ నుంచి మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) మరియు రామ్ చరణ్‌ (Ram Charan) కూడా అయోధ్యకు చేరుకున్నారు. ఈ అందరూ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వేడుకున్నారు.